![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 11:59 AM
శ్రీరామ నవమి పర్వదినం వేళ.. ఖమ్మం జిల్లా రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణానికి గాను సవరించిన అంచనా బడ్జెట్‌కు రాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపినట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 4,15,621 ఎకరాలకు సాగు నీటిని, మరో 3,89,366 ఎకరాలను స్థిరీకరించేందుకు చేపట్టిన ఈ పథకానికి ఇప్పటి వరకూ రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారు.