|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 02:17 PM
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు మోసం చేయడంతో ట్రాన్స్‌జెండర్ అతడి ఇంటి ముందు నిరసనకు దిగింది. ఈ ఘటన కర్నూల్‌లో చోటు చేసుకుంది. గణేష్ అనే యువకుడితో ఐదేళ్లక్రితం తనకు పరిచయం ఏర్పడిందని HYDకి చెందిన ట్రాన్స్‌జెండర్ హాసిని తెలిపింది. కొంతకాలం ఇద్దరం ప్రేమించుకున్నామని, ఆ తరవాత మంత్రాలయంలో తనను పెళ్లి చేసుకున్నాడని హాసిని చెప్పింది. ఇంట్లో వాళ్లను ఒప్పించి ఇంటికి తీసుకెళతానని నమ్మించి ఇప్పుడు మొహం చాటేశాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది.గణేష్ చదువు, అప్పులు కోసం ఆమె రూ.15 లక్షలు ఖర్చు చేసిందని తెలిపింది. నాలుగేళ్ల నుంచి వీరిద్దరికి పరిచయం ఉందని, కానీ ఇప్పుడు తనని వదిలి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ట్రాన్స్‌జెండర్ ఆరోపించింది. తనకి ఆరోగ్యం బాగా లేదని, ఫిట్స్ వస్తుందని వదిలేశాడని తెలిపింది. న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు హిజ్రా నిరసన చేపట్టింది. దీంతో మరో నలుగురు ట్రాన్స్‌జెండర్లు ఆమెకు మద్దతు ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌లో గతంలో ఈ ఘటనపై కేసు నమోదు కూడా చేయగా.. ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతుందని పోలీసులు తెలిపారు.