ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 01:18 PM
కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డికి చెందిన గోవర్ధన్ అనే యువకుడు నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఎంఎస్ చదువుతున్న గోవర్ధన్ హఠాత్తుగా అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన గురించి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు.
గోవర్ధన్ మృతితో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దుర్ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతులపై ఆందోళన వ్యక్తమవుతోంది.