|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 03:18 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం శుక్రవారం తెలంగాణ హైకోర్టు జస్టిస్ అలిశెట్టి లక్ష్మీ నారాయణ వచ్చారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారినిఅమ్మవార్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు అద్దాల మండపంలో ఆశీర్వచన ఏర్పాట్లు చేయగా, ఆలయ అర్చకులు, వేద పండితులు అలిశెట్టి లక్ష్మీ నారాయణకి వేదోక్త ఆశీర్వచనం అందజేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.