|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 12:40 PM
అత్తాపూర్‌లోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌పై శంషాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు మహిళలు, ఒక చిన్నారితో సహా నలుగురు గాయపడ్డారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా కారును తొలగించే చర్యలు చేపట్టారు.