|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 02:54 PM
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో హోమ్ గార్డ్ సిబ్బంది సంక్షేమార్థం అక్సిస్ బ్యాంక్‌తో కలిసి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాన్ని శనివారం అదనపు ఎస్పీ మహేందర్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక భద్రత, పొదుపు, రుణాలు, బీమా పథకాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. చిన్న పొదుపులు భవిష్యత్తులో పెద్ద భద్రతను ఇస్తాయని సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.