|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 02:56 PM
నిర్మల్ రూరల్ మండలంలోని కొండాపూర్ గ్రామం వద్ద గంజాయి విక్రయిస్తున్న ఆదిత్య అనే బాలుడిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మార్బుల్ షాపు వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని, పారిపోయేందుకు ప్రయత్నించిన బాలుడిని వెంబడించి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.2,750 విలువైన 115 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పెంబి మండలానికి చెందిన వ్యక్తి నుంచి కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు బాలుడు తెలిపాడు. ప్రాథమిక విచారణలో బాలుడికి గంజాయి సేవిస్తున్న అలవాటు ఉన్నట్లు తెలిసింది. గంజాయి అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.