|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 02:57 PM
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. నవంబర్ 15న కేంద్ర ప్రభుత్వం జనజాతీయ గౌరవ్ దివస్‌ను నిర్వహిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందరో నిజమైన స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను బయటికి రాకుండా చేసిందని బీజేపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.