|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 02:59 PM
దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో నల్ల పోచమ్మ తల్లి, పెద్ద పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలకు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నల్ల పోచమ్మ తల్లి ఆలయానికి రూ. 15 లక్షలు, పెద్ద పోచమ్మ ఆలయానికి రూ. 15 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగారెడ్డి, రాజేశ్వర్, పీఏసీఎస్ చైర్మన్ పివి రమణారెడ్డి, పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.