|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 03:15 PM
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సభ్యుల ఆదాయాన్ని పెంచేందుకు 600 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇస్తోంది. ఒక్కో బస్సుకు నెలకు రూ.70 వేల వరకు వచ్చే అద్దె నగదులు మహిళా సంఘాల ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. ఇప్పటికే మహబూబాబాద్‌లో పథకం అమలులో ఉంది. తొమ్మిది బస్సుల ద్వారా నెలకు రూ.6.24 లక్షలు, వార్షికంగా రూ.75 లక్షల ఆదాయం లభిస్తోంది. ఈ పథకం ద్వారా మహిళా సంఘాల ఆర్థిక స్థితి బలపడనుంది.