|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 03:46 PM
ఖమ్మం జిల్లాలో గురువారం ఉదయం ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. నేరడ గ్రామానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తి తన భార్య సాయివాణి (వయస్సు 35)ని కత్తితో నిర్దాకరంగా గొంతు కోసి హత్య చేశాడు. ఇద్దరూ గత కొంతకాలంగా కుటుంబ గొడవల కారణంగా విడిగా నివసిస్తున్నారు. సాయివాణి తల్లిదండ్రుల ఇంట్లో ఉంటూ వచ్చింది.
ఉదయం సాయివాణి తలుపు తీసిన వెంటనే ముందే దాక్కుని ఉన్న భాస్కర్ ఆమెపై దాడి చేశాడు. కత్తితో గొంతు పూర్తిగా కోసేసి రక్తపు మడుగులో ఆమె కూలిపోయేలా చేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కేకలు వేయగా, హత్యను అడ్డుకోవడానికి పరుగెత్తి వచ్చిన వారిని భాస్కర్ బెదిరించాడు.
అయితే ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరి కూతురు (వయస్సు 14)పై కూడా భాస్కర్ కత్తి ఝుళిపించాడు. ముందుగా ఆమెను చంపాలని చూసినా అమ్మాయి చాకచక్యంగా పక్కకు జరుక్కుని ప్రాణాలు కాపాడుకుంది. అయినప్పటికీ ఆమె చేతికి కత్తి దెబ్బ తగిలి మూడు వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
స్థానికులు, పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకుని భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఖమ్మం టౌన్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. కుటుంబ గొడవలు, ఆస్తి వివాదాలు ఈ దారుణానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ ఘటనతో నేరడ గ్రామమంతా దిగ్భ్రాంతికి గురైంది.