|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:05 PM
ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పి మోసం చేసిందని ఉద్యోగులు ఆరోపించారు. ఈనెల 7వ తేదీన యూనివర్సిటీకి రానున్న సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.