|
|
by Suryaa Desk | Mon, Jan 19, 2026, 02:20 PM
నటిగా వరుస సినిమాలు, ఇంటర్వ్యూలతో ప్రేక్షకులకు దగ్గరగా ఉంటానని రష్మిక మందన్న తెలిపారు. తాజాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆమె తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించారు. ‘‘నాపై వచ్చే చాలా వార్తలు పెద్ద రూమర్లు, వాటిలో అస్సలు ఏమాత్రం నిజం లేదు. వ్యూస్ కోసం నెగెటివిటీ సృష్టిస్తుంటారు. ఒకప్పుడు అవి బాధించేవి. ఇప్పుడు ఎదుర్కోవడం నేర్చుకున్నా’’ అని అన్నారు. ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్‌ననే ప్రచారం కూడా అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు.
Latest News