|
|
by Suryaa Desk | Mon, Jan 19, 2026, 02:24 PM
నటి పూజా హెగ్డే తన కెరీర్ ప్రారంభంలో ఓ పాన్ ఇండియా హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తాను అతడిని కొట్టినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షూటింగ్ సమయంలో అనుమతి లేకుండా క్యారవాన్‌లోకి వచ్చిన హీరోని కొట్టి, ఆ తర్వాత అతడితో నటించడానికి నిరాకరించినట్లు పూజా తెలిపారు. ఈ సంఘటన తర్వాత తన సీన్లను డూప్‌తో తీశారని ఆమె పేర్కొన్నారు. అయితే, ఆ హీరో ఎవరనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. పూజా హెగ్డే ప్రస్తుతం 'కాంచన 4', దుల్కర్ సల్మాన్ తో తెలుగు సినిమా, ఓ హిందీ సినిమాతో సహా పలు ప్రాజెక్టులలో నటిస్తున్నారు.
Latest News