|
|
by Suryaa Desk | Sat, Nov 18, 2023, 12:33 PM
తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న అందాల నటి నయనతార శనివారం తన 39వ పుట్టినరోజును జరుపుకుంటోంది. మలయాళీ చిత్రం 'మనస్సినక్కరే'తో వెండితెరకు పరిచయం కాగా, ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. 40 ఏళ్లు వస్తున్నా.. రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది. శ్రీరామరాజ్యం మూవీలో నటనకు గానూ ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డులను దక్కించుకుంది.
కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది నయనతార. దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ ఆమెను ఓ షోలో చూశాడు. తన సినిమాల్లో అవకాశం ఇచ్చాడు. అలా మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. 2003లో 'మనస్సినక్కరే' అనే మలయాళ సినిమాతో నయనతార హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. దాదాపు రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇప్పటికీ ఆమె క్రేజ్ పెరిగింది కానీ.. తగ్గలేదు. ఆమె తన సినీ కెరీర్‌లో ఇప్పటివరకు 75 సినిమాలు చేసింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికల్లో నయనతార ఒకరు. సౌత్ ఇండియన్ లేడీ తన అద్భుతమైన నటనతో సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందింది.
Latest News