![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 02:34 PM
హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. పలు ఆంక్షలు విధిస్తూ.. చార్మినార్, మక్కా మసీద్, భాగ్య లక్ష్మీ టెంపుల్ దగ్గర పటిష్ట బందోబస్తు కొనసాగిస్తున్నారు. 35ఏళ్ల తర్వాత ఒకే రోజు రంజాన్ మాసం రెండో శుక్రవారం.
జుమ్మ రోజున హోలీ పండుగ వచ్చింది. సున్నితమైన ప్రాంతాలు కావడంతో ఓల్డ్ సిటీలోని పలు చోట్ల పోలీసుల పికేటింగ్ ఏర్పాటు చేశారు. నగర పౌరులు కూడా పోలీసులకు సహకరించాలని వారు తెలిపారు.