![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 10:41 AM
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దశంకరంపేట మండలం కోలపల్లి వద్ద ఆగివున్న బస్సును డీసీఎం ఢీకొట్టింది. తీర్థయాత్రలకై విజయనగరం నుంచి 40 మంది పర్యాటకులు బస్సులో వెళ్లారు. షిర్డీ నుంచి శ్రీశైలం వెళ్తూ టీ తాగేందుకు కోలపల్లి వద్ద డ్రైవర్ బస్సు ఆపడంతో ఆగివున్న బస్సును డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఓ మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.