|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 03:53 PM
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ షాకిచ్చిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు.ఇవాళ వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. నేడు తులం బంగారంపై రూ. 440 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,022, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,270 వద్ద ట్రేడ్ అవుతోంది.హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 తగ్గడంతో రూ. 82,700 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 440 తగ్గడంతో రూ. 90,220 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,850గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 90,370 వద్ద ట్రేడ్ అవుతోంది.బంగారంతోపాటు వెండి ధరలు కూడా పరుగులు తగ్గుముఖంపట్టాయి. నేడు సిల్వర్ ధరలు తగ్గాయి. ఇవాళ కిలో వెండిపై రూ. 2,100 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,12,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,03,000 వద్దకు చేరింది.