![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 01:02 PM
టాంకర్ బుకింగ్.. డెలివరీలపై అశోక్ రెడ్డి జీఎంలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి మాట్లాడుతూ.. వరుసగా వచ్చిన సెలవులు అలాగే ఉగాది.. రంజాన్ పండగల సందర్భంగా కొంత మంది టాంకర్ డ్రైవర్లు సెలవులపై వెళ్లడంతో కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ బుకింగ్ పెండెన్సీ పెరిగినట్టు గుర్తించమని అన్నారు.వరుసగా వచ్చిన సెలవులువల్ల ట్యాంకర్ బుకింగ్ పెద్దగా పెరగకపోయినప్పటికీ డ్రైవర్ల సెలవులలో వెళ్లడంతో షేక్‌పేట్, షాపూర్‌నగర్, బుద్వేల్, ఆసిఫ్‌నగర్, ఎన్టీఆర్ నగర్, భవానీ నగర్, చిలకలగూడ, షాపూర్‌నగర్-2, మౌలా అలీ, గాజులరామారం, ఎర్రగడ్డ, గచ్చిబౌలి-2, వెంగళరావునగర్, ఎల్లారెడ్డిగూడ, వెంకటగిరి ఫిల్లింగ్ స్టేషన్ లలో వందకు పైగా ట్యాంకర్ పెండెన్సీ పెరిగిందని వివరించారు.ఈ పెండింగ్ పెండింగ్ గా ఉన్న టాంకర్లను డెలివరీ చేయడానికి రానున్న రెండు రోజులు అదనం గంటలు పనిచేయడానికి ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించాడు. రెండు షిఫ్టుల్లో ట్యాంకర్ డెలివరీ చేయడానికి ఏర్పాటు చేసుకోవాలని.. అందుకు అనుగుణంగా నీరు సరఫరా చేసే ఏర్పాట్లు చేయాలన్నారు. పగటి వేళల్లో గృహ అవసరాలకు.. రాత్రి వేళ కమర్షియల్ అవసరాలకు ట్యాంకర్లను డెలివరీ చేయడానికి ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ జూమ్ మీటింగ్ లో ఈడి మయాంక్ మిట్టల్ మాట్లాడుతూ.. ట్యాంకర్ డేటాను అనుసరించి ఏయే ఫిల్లింగ్ స్టేషన్ లలో, ఏయే సమయాల్లో బుకింగ్ అవుతున్నాయో అనాలసిస్ చేసుకుంటే పెండెన్సి తగ్గించుకోవచ్చని అన్నారు. అవసరమైన ఫిల్లింగ్ స్టేషన్ లలో పిల్లింగ్ పాయింట్స్ పెంచుకోవచ్చని అందుకు ప్రపోజల్స్ సమర్పించాలని ఆదేశించారు.