|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 12:59 PM
యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఉన్న ప్రీమియర్ లీగ్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది.ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు సంఘటన స్థలానికి చేరుకొని పేలుడు సంభవించిన స్థలాన్ని పరిశీలించారు.ఆ తర్వాత బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.సంఘటన జరగటం చాలా బాధాకరమన్నారు.ఇది కేవలం యాజమాన్యం నిర్లక్ష్యమని,కార్మికుల ప్రాణాలు గాలికి వదిలేసి ఎలాంటి భద్రత చర్యలు తీసుకోకుండా పనులు చేయించడం బాధాకరమన్నారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్యం అందిచాలని డాక్టర్లతో మాట్లాడారు.మిగిలిన వ్యక్తుల మృత దేహాలు కూలిపోయిన గోడల కింద ఉండిపోవటం జరిగిందని,రేపు వాటిని తొలగించి,కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేసేలా చూస్తామని అన్నారు.మరొక చోట ఇలాంటి సంఘటనలు జరకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.