|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 12:48 PM
తెలంగాణలో నిన్న విడుదలైన పదో తరగతి ఫలితాల్లో బాలికలు అద్వితీయ ప్రతిభను చాటారు. రాష్ట్ర టాపర్లుగా నిజామాబాద్‌కు చెందిన సిర్ప కృతి, కామారెడ్డి జిల్లాకు చెందిన నిమ్మ అంచిత 600కు 596 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు.
హైదరాబాద్‌కు చెందిన అద్వైత, సూర్యాపేట జిల్లాకు చెందిన సాయిసృజన 595 మార్కులతో రెండో స్థానాన్ని సాధించారు. అనేక మంది విద్యార్థులు 594 మార్కులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ ఫలితాలు అమ్మాయిల శ్రేష్ఠతను మరోసారి నిరూపించాయి.