|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 12:18 PM
కాంగ్రెస్ ఖేల్ ఖతం. దుకాణ్ బంద్ అంటూ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంగళవారం హాట్ కామెంట్స్ చేశారు. సీఎం వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. ఇగ రైతుల హామీలన్నీ గాలికొదిలేసినట్లేనని ఎద్దేవా చేశారు. తులం బంగారం ఒట్టిమాటేనని తేలిందని, మోసాల కాంగ్రెస్ ను వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అప్పులు చేశాడని చెప్పిన మీరు... తాము వస్తే అంతా బాగుంటుందని మాయమాటలు చెప్పి అధికారంలోకొచ్చారు. రేపట్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం. కేంద్ర మంత్రులు, ప్రధాని వచ్చినప్పుడు సాయం చేస్తున్నారని మాట్లాడే కాంగ్రెస్ నాయకులే.. మళ్లీ ఆ తర్వాత కేంద్రం ఏం చేయడం లేదని రాజకీయాలు చేస్తారు’’ అంటూ బండి సంజయ్ దుయ్యబట్టారు.