|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 12:15 PM
గచ్చిబౌలిలో భారీగా కమర్షియల్ షెడ్లు కూల్చివేసిన హైడ్రా అధికారులు. సంధ్య కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్‌ను కూల్చివేసిన అధికారులు . అక్రమంగా నిర్మించిన కొన్ని ఫుడ్ కోర్టులను సైతం కూల్చివేసిన హైడ్రా.పోలీసులు ఘటనా స్థలంలో బందోబస్తును ఏర్పాటు చేసి, ఎవరికీ లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. ఈ కూల్చివేతలు ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ పరిధిలో నిర్వహించబడ్డాయి. సంబంధిత లేఅవుట్‌కు ప్రభుత్వ అనుమతులు లేకుండానే రోడ్లు, పార్కులు వంటి ఉమ్మడి భూములపై ఆక్రమణలు జరిగాయని తెలుస్తోంది. గతంలో వేసిన లేఅవుట్ నామరూపాలు లేకుండా రోడ్లు, పార్కును కలుపుతూ సంధ్యా కన్‌స్ట్రక్షన్ పలు ఆక్రమలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు అనుమతులు లేని కట్టడాలను తొలగించారు.లేఅవుట్‌ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్, జీ ప్లస్ 2గా నిర్మించిన 3 ఐరన్ షడ్‌లను, మినీ హాల్‌తోపాటు వంటగదులు, రెస్ట్ రూమ్‌లను నేలమట్టం చేశారు. ఇంకా పలు నిర్మాణాలను కూల్చివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.