|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 12:13 PM
ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణారెడ్డి, నరసింహ డిమాండ్ చేశారు. మంగళవారం నారాయణపేటలో విలేకరులతో మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపించాల్సిన ముఖ్యమంత్రి ఇంతకంటే ఎక్కువ తన వల్ల కాదని చెప్పడం నిరాశకరమని వారు వ్యక్తం చేశారు.
ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కృష్ణారెడ్డి, నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు.