|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 11:42 AM
మేడ్చల్ లో తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ జెఏసి నేత నెర్థం భాస్కర్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం నోవా బ్యాంకెట్ హాల్ లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నెర్థం బాలయ్య భాగ్యలక్ష్మి సేవా ట్రస్టు చైర్మన్ భాస్కర్ గౌడ్, డా. మనుషా గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 2,000 మంది ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు, అవసరమైన వారికి కళ్ళద్దాలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు భాస్కర్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.