|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 11:36 AM
TG: మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు (తనూష, సాయి ప్రియ, నందిని) మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ అమ్మాయిల తండ్రి ఎల్లయ్యను MLA మనోహర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.7 లక్షల చొప్పున రూ.21 లక్షల విలువైన చెక్కులను ఆయనకు MLA అందజేయగా.. తన కూతుళ్లను గుర్తు చేసుకుంటూ ఎల్లయ్య బోరున విలపించారు. 'ఈ డబ్బులు నా ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా' అంటూ గుండెలు బాదుకున్నారు.