|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 11:55 AM
చెంగిచెర్ల హనుమాన్ నగర్ ప్రాంతంలో వీధి కుక్కల సమస్య తీవ్రమవుతోందని స్థానిక నివాసి రాజేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో గుంపులుగా తిరుగుతూ పిల్లలు, పెద్దలపై భయాందోళన సృష్టిస్తున్నాయని, ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజేశ్ మాట్లాడుతూ, “రోజురోజుకు బయట తిరిగే కుక్కల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులు, మహిళలు రాత్రి బయటికి వెళ్లడానికి కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. సంబంధిత శాఖలు వెంటనే స్పందించాలి” అని అన్నారు. వీధి కుక్కల నియంత్రణకు వ్యాక్సినేషన్, స్టీరిలైజేషన్ కార్యక్రమాలను వేగవంతం చేసి నివాసులకు భరోసా కల్పించాలని కోరుతున్నారు.