|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 12:07 PM
తెలంగాణ MLAల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ 2వ విడత విచారణను ఇవాళ, రేపు స్పీకర్ కార్యాలయంలో కొనసాగించనున్నారు. BRS నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న MLAలు తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీ, డాక్టర్ సంజయ్‌లను విచారణకు హాజరుకావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది. రెండ్రోజుల పాటు విచారణ కొనసాగించనున్న స్పీకర్, మళ్లీ ఈ నెల 12, 13 తేదీల్లో వీరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.