|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 12:32 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేట మండల కేంద్రంలో యు.టి.యం పౌండేషన్ సభ్యులు గురువారం నాడు రోడ్లపై పడి ఉన్న చెత్త, పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్ కవర్లు, డ్రైనేజీలలోని వ్యర్థాలను తొలగించారు. వేలేరుపాడు మండలంలోని కోయమాదారం గ్రామంలో 'స్వచ్ఛ విలేజ్' కార్యక్రమం నిర్వహించి, గ్రామస్తులతో కలిసి పరిశుభ్రత చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా వాతావరణ కాలుష్యం, సీజనల్ వ్యాధులను నివారించవచ్చని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పౌండేషన్ డైరెక్టర్ పాయం స్టీవెన్ తెలిపారు.