|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 11:36 AM
హైదరాబాద్‌లోని అత్తాపూర్ పిల్లర్ నం.185 వద్ద ఉన్న సుజుకి షోరూమ్ సర్వీస్ సెంటర్లో మంటలు చెలరేగి మూడు కార్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో 50 వాహనాలకు ప్రమాదం తప్పింది. ముందుజాగ్రత్తగా పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోని 90 కుటుంబాలను పోలీసులు ఖాళీ చేయించారు.పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులు మంటలను గమనించి ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించటం తో నిమిషాల వ్యవధిలో అగ్నిమాపక సిబ్బంది రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే రెండు ఫైరింజన్‌లతో మంటలను అదుపు చేయటంతో ఘోర ప్రమాదం తప్పింది. ప్రమాదానికి షో రూమ్ నిర్వాహకుల అలసత్వమే కారణమని వేస్ట్ ఆయిల్స్ బ్యాటరీలు అన్నీ కలిపి ఒకే దగ్గర పెట్టడంతో ప్రమాదం సంబంధించిందని స్థానికులు అంటుండగా.. ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ పని చేసి ఉంటారని షోరూం నిర్వాహకులు అంటున్నారు.ముందు జాగ్రత్తగా అపార్ట్మెంట్లో ఉన్న 90 ఫ్యామిలీలను పోలీసులు ఖాళీ చేయించారు. షోరూం నిర్వాహకుల అశ్రద్ధ వల్లే ప్రమాదం సంభవించిందని కాలనీవాసులు అంటున్నారు. అయితే ఎవరో ఉద్దేశపూర్వకంగా నిప్పు అంటించి ఉంటారని షోరూమ్ నిర్వాహకులు అంటున్నారు. దీనిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి సిసిటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.