|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 12:14 PM
భారతి నగర్ : ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ భారతి నగర్, రామచంద్రపురం, పటాన్చెరు డివిజన్లను అభివృద్ధికి ప్రతీకలుగా తీర్చిదిద్దామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజి. మ్యాక్ సొసైటీ కాలనీలలో ఒక కోటి 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, కాంపౌండ్ వాల్, కమ్యూనిటీ హాళ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇందుకు అనుగుణంగా ప్రణాళికల రూపొందిస్తూ నిధులు కేటాయించామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సొంత నిధులతో వివిధ కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మ్యాక్ సొసైటీ కాలనీలో బీటీ రోడ్డు రెన్యూవల్ కు సంబంధించి నిధులు మంజూరయ్యాయని.. డబుల్ రోడ్డు కోసం ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు. మ్యాక్ సొసైటీ కమ్యూనిటీ హాల్ ఆవరణలో సొంత నిధులతో బోరుతో పాటు బోరు వేయించడం జరిగిందని.. త్వరలోనే మోటారు బిగిస్తామని హామీ ఇచ్చారు.