|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 02:46 PM
ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకలు సమావేశం జరిగింది. సమావేశంలో శ్రీరామ్‌నగర్ డివిజన్ చెందిన నాయకులు విజయ్ రెడ్డి గారు మరియు,వాలా బృందం చేరుతున్న సందర్బంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు గారి నాయకత్వంలో ,మారబోయిన రవి యాదవ్ గారి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలోకి రానున్న కీలక నాయకుల చేరికలపై విస్తృతంగా చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో జరిగే పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించారు.ఈ సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు, మహిళా నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. ప్రజల కోసం పనిచేసే బీఆర్‌ఎస్ పార్టీ మరింత బలపడుతూ,శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీ విజయదిశగా ముందుకెళ్తోందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.