|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 12:20 PM
పటాన్చెరువు నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు శంకర్పల్లి, నార్సింగ్ మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన వివిధ శుభకార్యాలలో యువ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అక్కడ జరిగిన వివాహ వేడుకలు, గృహప్రవేశాలు, పుట్టు పంచలు మరియు ఇతర శుభకార్యాలకు హాజరై కుటుంబ సభ్యులను ఆప్యాయంగా కలుసుకున్నారు. నూతన దాంపత్య జీవితం ప్రారంభిస్తున్న జంటలకు ఆశీస్సులు అందిస్తూ, కొత్తగా గృహప్రవేశం చేసిన కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చిన్నారుల పుట్టు పంచల వేడుకల్లో పాల్గొని కుటుంబ సభ్యుల ఆనందంలో భాగస్వాములయ్యారు.ప్రజలతో సన్నిహితంగా మమేకమై వారి సంతోషాల్లో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ గారు తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలే తనకు మరింత సేవ చేయడానికి ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, స్నేహితులు, అభిమానులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.