ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 12:30 PM
చిల్లపల్లి గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో స్వయం సహాయక సంఘం(SHG) మహిళల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో సుమారు 40 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చిల్లపల్లి, దుబ్బపల్లి, సిరిపురం, బెస్తపల్లి గ్రామపంచాయతీలకు చెందిన మహిళల కోసం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిల్లపల్లి సర్పంచ్ గోపు సంతోష్ కుమార్ ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి, నిర్వహిస్తున్న పరీక్షల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.