ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 03:31 PM
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మార్సీ భవన్ లో సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారం టీఎస్ యూటీఎఫ్ అధ్వర్యంలో నిరసన తెలిపారు. తమకు పే స్కేల్ వేతనాలు చెల్లించడంతోపాటు సమ్మె కాలపు వేతనాన్ని వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు విన్నవించినా సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇచ్చినా ఇప్పటివరకు నెరవేరలేదని ఉద్యోగులు ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.