|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 10:38 AM
గత కొన్ని రోజులుగా మార్వెల్ ఫ్యాన్స్ లో జో కీరీ, ఘోస్ట్ రైడర్ గా ఎంసియులోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. 'స్ట్రేంజర్ థింగ్స్' నటుడు జో కీరీ, తన యూనిక్ హెయిర్ స్టైల్, నటనతో (స్టీవ్ హారింగ్టన్ పాత్ర) అందరినీ ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు అతడిని డాని కేచ్ వెర్షన్ ఘోస్ట్ రైడర్‌గా ఊహించుకుంటూ కొన్ని ఫ్యాన్ ఆర్ట్ ఫోటోలను రూపొందించారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో మార్వెల్ నిజంగానే ఆయనను సంప్రదించిందనే రూమర్లు పుట్టాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్ల గురించి నటుడు జో కీరీని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ, "నేను కూడా ఆ వార్తలను చూశాను. కానీ ప్రస్తుతానికి అవేవీ నిజం కావు. అయితే మార్వెల్ సినిమాల్లో నటించడం ఎవరికి ఇష్టం ఉండదు? అలాంటి అవకాశం వస్తే తప్పకుండా ఆలోచిస్తాను!" అని పేర్కొన్నారు.
Latest News