![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 03:33 PM
CM రేవంత్ ఢిల్లీ వ్యాఖ్యలపై KTR ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. గల్లీలో హోదాను మరిచి తిట్లు.. ఢిల్లీలో చిట్ చాట్లు అంటూ ట్వీట్ చేశారు. 'కాలు గడప దాటదు కానీ, ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి.
నీళ్లు లేక అన్నదాతలు అరిగోస పడుతుంటే, సాగునీళ్లపై సమీక్ష లేకుండా CM ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. 39 సార్లు ఢిల్లీ పోయి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప, రూపాయి తేలేదు' అని KTR CMపై మండిపడ్డారు.