|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 12:18 PM
జనగణనతో పాటు కులగణన చేయడం స్వాగతిస్తున్నామని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు అన్నారు.జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిచడం కాంగ్రెస్ పార్టీ,తెలంగాణ ప్రభుత్వం తరపున స్వాగతిస్తున్నామన్నారు.కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కులగణన చేయలేదని అనటం ఆశ్చర్యంగా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రం కులగణన చేసిన తర్వాత దేశంలో రోల్ మోడల్ అయిందన్నారు.రాహుల్ గాంధీ గారు భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న సమయంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ కులాల వ్యవస్థ చూసి దామాషా ప్రకారం మేమెంతో మాకు అంతా అనే గుర్తించడం కోసం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం కులగణన చేయడం జరిగిందన్నారు.కులగణన చేయడమే కాకుండా దానికి చట్ట భద్రత చేసి కేంద్రానికి పంపటం జరిగిదన్నారు.2018 సంవత్సరంలో జనగణనతో పాటు ఓబీసీ కులగణనను చేస్తా అని చెప్పి రాజనాథ్ సింగ్ గారు మాట తప్పరని అన్నారు.రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు భారత దేశం మొత్తంలో జనగణన తో పాటు కులగణన చేయాలని కోరారు.