|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 01:51 PM
కల్వకుర్తి మండలం మార్చాలకు చెందిన ప్రభావతి (40) మంగళవారం ఉదయం పంజుగుల గ్రామ రోడ్డులోని కేఎల్ఐ కాలువలో శవమై కనిపించింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సోమవారం ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. చివరకు ఆమె కేఎల్ఐ కాలువలో శవమై కనిపించింది.
పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించార. కేసు నమోదు చేసి మరణానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.