|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 01:54 PM
మునిసిపాలిటీ కేంద్రంగా ఏర్పడిన అమరచింతలో జూనియర్ కాలేజీ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ ఆరోపించారు.
మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, మునిసిపాలిటీగా ఏర్పడి సంవత్సరాలు గడిచినప్పటికీ, జూనియర్ కాలేజీ ఏర్పాటులో గత, ప్రస్తుత పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. విద్యార్థుల సౌలభ్యం కోసం వెంటనే కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.