|
|
by Suryaa Desk | Wed, May 07, 2025, 12:31 PM
కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న సీఎస్, డీజీపీ, సీపీ, పోలీస్ ఉన్నతాధికారులు. ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో సీఎం. సాయంత్రం జరిగే మాక్ డ్రిల్ ను స్వయంగా పర్యవేక్షించనున్న సీఎం రేవంత్ రెడ్డి. స్థానికంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం. రక్షణ విభాగాలకు వ్యూహాత్మక కేంద్రంగా ఉన్న హైదరాబాద్.రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించడం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అత్యవసర భేటీలో చర్చిస్తారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. అత్యవసర వైద్య సేవలు, ఆహార సరఫరా, ఇతర సహాయక చర్యల గురించి కూడా అధికారులు చర్చించనున్నారు. ఇక ఆపరేషన్ సిందూర్‌పై పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. 'భారత్ మాతా కీ జై' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సైతం సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 'ఒక భారతీయ పౌరుడిగా.. మన సాయుధ దళాలకు అండగా నిలుస్తాం.