|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 10:40 AM
హైదరాబాద్ రాంనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మూడువేల రూపాయల లోన్ కట్టాలని లేదంటే కుటుంబం మొత్తం నగ్న ఫొటోలు, వీడియోలు పంపిస్తామని బెదిరించడంతో ప్రేమ్‌కుమార్ (36) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భార్య నాగవేణి తెలిపిన వివరాల పోలీసులకు ఫిర్యాదు చేద్దామని, సమీప ప్రాంతంలోని బంధువులు కూడా ధైర్యంగా ఉండాలని సూచించారన్నారు. ఇంతలోనే తన ఫోన్‌కు పంపిన న్యూడ్ ఫోటోలు, వీడియోల విషయమై తీవ్రమనోవేదనకు గురైన ప్రేమ్‌కుమార్ ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని కోరుతూ తీవ్ర ఆందోళన చెందాడన్నారు. కొత్త ఫోన్ తీసుకుందామని చెప్పినా, తీవ్ర మనస్థాపానికి గురై అద్దె ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.