|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:26 PM
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని కాటేడాన్ డివిజన్‌లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బుధవారం పర్యటించి, శ్రీరామ్ నగర్, వెంకటేశ్వర నగర్, నేతాజీ నగర్ బస్తీల్లో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ మరమ్మతులు, వేసవిలో నీటి ఎద్దడి నివారణకు క్రమబద్ధ నీటి సరఫరాపై అధికారులను ఆదేశించారు. పాడైన అంతర్గత రోడ్లకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గారు అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ లైన్లను పునరుద్ధరించడం.నిరంతర తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిశీలన.కొత్తగా సి.సి. రోడ్ల నిర్మాణం మరియు నిరంతరం వెలిగేలా వీధి దీపాల ఏర్పాటు.బస్తీలోని స్మశాన వాటికలో అవసరమైన కనీస సౌకర్యాల కల్పన పై అయన ద్రుష్టి సారించారు.