|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 11:14 AM
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని భారీ మెజార్టీతో గెలిపించిన నితిన్ నబిన్, 45 ఏళ్ల వయసులోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల అనంతరం జాతీయ అధ్యక్షుడిగా ఆయన తొలిసారి తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం నిర్వహించనున్న 'బూత్ కార్యకర్తల సమ్మేళనం'లో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ ఆయన పర్యటన షెడ్యూల్‌ను ప్రకటించింది.బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ రోజు ఉదయం 10:45 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:00 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడ పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి, మధ్యాహ్నం 3:00 గంటలకు మహబూబ్‌నగర్‌లోని MVS డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు MVS డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. సాయంత్రం 4:15 గంటలకు మహబూబ్‌నగర్ నుండి బయలుదేరి, సాయంత్రం 5:45 గంటలకు తిరిగి శంషాబాద్ చేరుకుంటారు. రాత్రి 6:35 గంటలకు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని బీజేపీ షెడ్యూల్ ప్రకటించింది.