|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:17 PM
ఏడాదికి పైగా విదేశాలలో నివసిస్తూ భారత్ కు వచ్చే భారతీయులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దశాబ్ద కాలం నాటి పాత నిబంధనలను మారుస్తూ ‘బ్యాగేజీ నిబంధనలు-2026’ను అమల్లోకి తెచ్చింది. ఫిబ్రవరి 2వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (CBIC) స్పష్టం చేసింది.ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చే మహిళలు 40 గ్రాములు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారాన్ని తెచ్చుకునే వీలున్నా.. వాటి విలువపై (వరుసగా రూ. లక్ష, రూ. 50 వేలు) పరిమితి ఉండేది. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఈ విలువ పరిమితిని కేంద్రం పూర్తిగా తొలగించింది. అంటే, నిర్ణీత బరువు లోపు ఎంత విలువైన ఆభరణాలు తెచ్చినా కస్టమ్స్ సుంకం చెల్లించాల్సిన అవసరం లేదు.
మహిళలు: 40 గ్రాముల వరకు ఆభరణాలు (విలువతో సంబంధం లేదు).
పురుషులు: 20 గ్రాముల వరకు ఆభరణాలు (విలువతో సంబంధం లేదు).
పిల్లలు (15 ఏళ్ల లోపు): 40 గ్రాముల వరకు ఆభరణాలు సుంకం లేకుండా తేవచ్చు. ఈ వెసులుబాటు కేవలం ఆభరణాలకు మాత్రమే. బంగారు బిస్కెట్లు లేదా కడ్డీలు తెస్తే నిబంధనల ప్రకారం సుంకం చెల్లించాల్సిందే.