|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 02:12 PM
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివారులో న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురయ్యారు. పొలం వద్ద జరిగిన ఈ ఘటనలో దుండగులు ఆమె మెడపై నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న స్వప్న హత్యపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.స్వప్నకు ఆమె అన్నతో కొంతకాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇవాళ మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో పొలం వద్ద పంచాయతీ జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన అన్న.. స్వప్పను దారుణంగా హత్య చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్వప్న హత్యపై చేవేళ్ల కోర్టులో న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.