|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 02:36 PM
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని, ఆధారాలు లేవంటూ స్పీకర్ తీర్పు ఇవ్వడం దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు. గాంధీభవన్ లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు సంసారం చేస్తున్నారని, జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగులు పెట్టి, వారి చేతికే బి. ఫాంలు పంచుతున్నారని ఆరోపించారు. కళ్లముందే ఇవన్నీ కనిపిస్తున్నా పార్టీ మారినట్లు ఆధారాలు లేవని కేసు కొట్టివేయడం దారుణమని, ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని అన్నారు. స్పీకర్ పదవికి మచ్చ తెచ్చుకోవద్దని ఆయన కోరారు. కేటీఆర్ తన జోలికొస్తే అతని బతుకును రోడ్డుకీడుస్తానని, అతని నీచ పనులన్నీ బయటపెడతానని హెచ్చరించారు.