|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 07:09 PM
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 108 అత్యవసర అంబులెన్స్‌ను బేసిక్ లైఫ్ సపోర్ట్ నుంచి అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్‌గా తీర్చిదిద్దారు. మంగళవారం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఈ వాహనాన్ని పరిశీలించారు. ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్, డీఫిబ్రీలేటర్, మానిటర్ వంటి అత్యవసర పరికరాల పనితీరును ఆమె పరిశీలించి, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అత్యవసర సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించి, ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలని సిబ్బందికి సూచించారు. వాహనంలోని రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నయీమ్ జహ, 108 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్, సిరిసిల్ల జిల్లా మేనేజర్ అరుణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.