|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 02:53 PM
‘‘అడ్డుగా ఉన్నాయని ఇవ్వాళ మూగ జీవాలను చంపేస్తున్నాం.. రేపు ముసలి వాళ్లయ్యారు, అడ్డుగా ఉన్నారని అమ్మానాన్నలను కూడా వదిలించుకుంటామా..’’ అంటూ యాంకర్ రష్మి గౌతమ్ ప్రశ్నించారు. వీధి కుక్కల పట్ల జరుగుతున్న హింసను ఆమె ఖండించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో రష్మి మాట్లాడారు. జంతువుల పట్ల మానవత్వం ప్రదర్శించాలని కోరారు.రుచి కోసం మూగజీవాలను చంపి తింటున్నామని, దూడలకు అందాల్సిన జున్ను పాలను కూడా పిండుకుని తాగేస్తున్నామని, ఇప్పుడు కుక్కలు కరుస్తున్నాయని వందలాది వీధి కుక్కలను అమానుషంగా చంపేస్తున్నామని వాపోయారు. ఇటీవల తెలంగాణలోని రెండు గ్రామాల్లో వందలాది కుక్కలను విషపు ఇంజెక్షన్లతో చంపేయడంపై రష్మి ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలు మనుషులను కరుస్తున్నాయన్న కారణాలతో వాటిని చంపాలని చూడటం సరికాదన్నారు. అసలు సమస్యను గుర్తించే ప్రయత్నం చేయాలని కోరారు.
Latest News