by Suryaa Desk | Thu, Jan 23, 2025, 02:50 PM
అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ రంగంలోకి వచ్చిన జాన్వీ కపూర్ తన టాలెంట్ తో అగ్రనటిగా ఎదిగింది. పాన్ ఇండియా సినిమాలతో ఆమె ఎంతో బిజీగా ఉంది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది. తారక్ తో 'దేవర2', రామ్ చరణ్ తో 'ఆర్సీ 16' సినిమాలు చేస్తోంది. తాజాగా బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ షోలో పాల్గొన్న జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనేది తన కోరిక అని చెప్పింది. భర్త, ముగ్గురు పిల్లలతో తిరుమలలో హాయిగా గడపాలనుందని తెలిపింది. ప్రతిరోజు అరటి ఆకులో అన్నం తింటూ... గోవిందా గోవిందా అని స్మరించుకోవాలనుందని చెప్పింది. అలాగే మణిరత్నం సినిమాల సంగీతం వింటూ కూర్చోవాలని ఉందని తెలిపింది. జాన్వీకి తిరుమల వేంకటేశ్వరస్వామిపై అమితమైన భక్తి ఉందనే విషయం తెలిసిందే. తనకు సమయం దొరికినప్పుడల్లా తిరుమల దర్శనానికి వస్తుంటుంది.
Latest News